రెండు రోజుల్లోనే 435 కోట్లు రాబట్టిన ఆక్వామ్యాన్

ఒక సినిమా 100 కోట్లు సాధించడమే కష్టం అనుకునే సమయంలో హాలీవుడ్ సినిమాలు వేల కోట్లు రాబట్టి వరల్డ్ వైడ్ సెన్సేషన్ సృష్టిస్తాయి. ఆ హాలీవుడ్ సినిమాలకే షాక్ ఇస్తూ జేమ్స్ వ్యాన్ నటించిన ఆక్వామ్యాన్ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే 435కోట్లు రాబట్టి ప్రపంచవ్యాప్త సినీ వర్గాలకి షాక్ ఇస్తుంది. ఆక్వామ్యాన్ సాధించిన ఈ 435 కోట్లు కేవలం చైనాలోనే కావడం విశేషం.

చైనాలో కాసుల వర్షం కురిపిస్తున్న చిత్రం

మాములుగా అయితే ఏ సినిమాని అయినా వరల్డ్ వైడ్ ఒకేసారి రిలీజ్ చేస్తారు కానీ ఆక్వామ్యాన్ విషయంలో అలా జరగలేదు. సరిగ్గా మూడు రోజుల క్రితమే చైనాలో మాత్రమే ఈ సినిమాని రిలీజ్ చేశారు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి చైనా సినీ అభిమానూలు బ్రహ్మరథం పలికారు. మొత్తంగా 61.2 మిలియన్ డాలర్లు రాబట్టిన ఆక్వామ్యాన్ ముందెన్నడూ చూడని కలెక్షన్స్ రాబడుతూ కొత్త చరిత్ర సృష్టిస్తుంది.