రెండిళ్ల పూజారి!

, రెండిళ్ల పూజారి!

ఇప్పటికే విజయవాడలో ఇళ్లు, పార్టీ కార్యాలయం నిర్మిస్తోన్న జనసేనాని… తాజాగా పవన్‌ కల్యాణ్‌  మరో చోట కూడా ఇల్లు కడుతున్నారు. అదేంటీ విజయవాడలో కడుతున్నారు కదా అని ఆశ్చర్యపోతున్నారా..? అసలు పవన్‌ కళ్యాణ్ ఇల్లు ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నారా…? 

కారు ఈఎంఐలు…

హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతమైన జూబ్లీహిల్స్‌ రోడ్డు నెం. 36లో పవన్‌ కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. గృహ ప్రవేశ కార్యక్రమానికి అన్నయ్య చిరంజీవి, వదినలను మాత్రమే పిలిచాడు. దాదాపు 50 కోట్ల రూపాయలు విలువ చేసే ఇంటిని నిర్మించిన పవన్‌ … ఇళ్లు కట్టుకుంటే తప్పు లేదు కానీ అంత గోప్యంగా ఉంచడం ఎందుకు? కారు ఈఎంఐలు కట్టడానికి డబ్బులు లేవన్న పవన్‌ 50 కోట్లతో ఇల్లు ఎలా కడుతున్నారు? ఆర్థికంగా తన పరిస్థితి బాగా లేదని పదే పదే చెప్పే పవన్‌ కళ్యాణ్ కి అంత డబ్బు ఎక్కడది..?