తన పదవికి రాజీనామా చేసిన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్

ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన రాజీనామా చేసినట్టు ఆయన వెల్లడించారు. తన రాజీనామా వెనుక ఎలాంటి ఒత్తిళ్లూ లేవన్నారు. తక్షణమే ఆర్బీఐ గవర్నర్‌ పదవి నుంచి వైదులుగుతున్నా అని ఆయన ప్రకటించారు. తనకు సహకరించిన సిబ్బంది, ఆర్బీఐ డైరెక్టర్లకు కృతజ్ఞతలు చెప్పారు ఉర్జిత్.