Breaking News
  • తూ.గో: పెద్దాపురంలో దారుణం. యర్రా శివశంకర్‌ అనే వ్యక్తిపై నగేష్‌ కత్తితో దాడి. పరిస్థితి విషమం, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు.
  • అమరావతి: ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. ప్రలోభాలకు లొంగలేదనే మండలి రద్దు తీర్మానం చేశారు. సెలెక్ట్‌ కమిటీ అంటే జగన్‌కు ఎందుకంత భయం. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఎందుకు విచారణ జరపలేదు -ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు.
  • మద్దాల గిరిని ఆర్థికంగా బెదిరించి పార్టీలోకి లాక్కున్నారు.
  • 11 మంది భారతీయ మత్స్యకారులను బంధించిన శ్రీలంక. ఒక పడవను స్వాధీనం చేసుకున్న శ్రీలంక నేవీ సిబ్బంది.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం. 16 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.02 కోట్లు. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 44,366 మంది భక్తులు.
  • సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ బదిలీ. అమోయ్‌ కుమార్‌ను రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు. నేరేడుచర్ల ఇంచార్జి కమిషనర్‌ మహేందర్‌రెడ్డి సస్పెన్షన్‌. తహశీల్దార్‌ రాంరెడ్డికి ఇంచార్జి బాధ్యతలు. కేవీపీ ఓటు విషయంలో అధికారుల తీరుపై ప్రభుత్వం చర్యలు.

రజనీకాంత్ పిక్‌తో ఆస్ట్రేలియా పోలీసుల పాఠాలు

, రజనీకాంత్ పిక్‌తో ఆస్ట్రేలియా పోలీసుల పాఠాలు

రజనీకాంత్‌ను సూపర్ స్టార్ అనడానికి కారణం ఉంది. భారత చిత్ర రంగాన్ని ఏలుతున్న సూపర్ హీరో. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా జపాన్‌లో ఆయనకున్న ఫ్యాన్ బేస్ మామూలు విషయం కాదు. తాజాగా ఆయన ఆస్ట్రేలియాలో వైరల్ అయ్యారు. ఆస్ట్రేలియా పోలీసులకు బాగా ఉపయోగపడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పాఠాలు చెప్పేందుకు రజనీకాంత్‌ను రిఫరెన్స్‌గా ఆస్ట్రేలియా పోలీసులు వాడుకున్నారు.

రజనీ ఇటీవలే నటించిన రోబో 2.0 మూవీలోని ఒక పిక్‌తో డ్రంక్ డ్రైవింగ్ పాఠం చెప్పారు. ఆస్ట్రేలియాలోని దర్బే పోలీసులు వారి అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఫిబ్రవరి 10వ తేదీన రోబో 2.0లోని రజనీ పిక్‌ను వాడుతూ పోస్ట్ చేశారు. మామూలుగా అయితే ఆ పోస్ట్ వైరల్ అయ్యేది కాదేమో, కానీ రజనీ పిక్‌ను వాడటం వల్ల బాగా వైరల్ అయ్యింది. లైక్‌లు, షేర్లు బాగా పెరిగాయి. భారతీయులు దాన్ని బాగా వైరల్ చేస్తున్నారు.

పలువురు కామెంట్ చేస్తూ రజనీ ఫొటో వాడుకున్నారు కాబట్టే మీ ట్వీట్ వైరల్ అయ్యిందని అంటున్నారు. ఇంతకీ ఆ పోలీసులు ట్వీట్‌లో ఏం చెప్పారంటే.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఒక వ్యక్తిని పరీక్షించగా ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉన్నట్టు తేలిందట. సాధారణంగా అనస్తీషియా ఇస్తే ఉండేంత మత్తు ఆ వ్యక్తికి ఉందట.

అతని BAC 0.341% ఉందని పోలీసులు చెప్పారు. ఆల్కహాల్ తాగి డ్రైవింగ్ చేయొద్దని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మేటర్ చెప్పేటప్పుడు రజనీ ఫొటోను ఆ పోలీసులు వాడుకోవడం వల్ల మనం మన సూపర్ స్టార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం. మరి మన రజనీ అంటే మామూలు విషయమా? అందుకే ఆయన సూపర్ స్టార్ ఆఫ్ ది వరల్డ్.