Breaking News
  • భద్రాద్రి: పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో భూప్రకంపనలు. టీచర్స్‌కాలనీ, బొడ్డుగూడెం, గట్టాయిగూడెం కాలనీల్లో భూప్రకంపనలు. అంజనాపురం, లక్ష్మీపురం, టేకులచెరువులో భూప్రకంపనలు. భయాందోళనలో స్థానికులు.
  • హైదరాబాద్‌: నగరంలో మంత్రి తలసాని పర్యటన. నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు.. పోలీసులు, వైద్య సిబ్బందికి గులాబీ పూలు ఇచ్చి అభినందించిన తలసాని. ఎనర్జీ డ్రింక్‌, మంచినీళ్లు, శానిటైజర్లు అందజేసిన మంత్రి తలసాని. రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కలుసుకుంటూ.. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.
  • కరోనా వైరస్‌ను ఏపీ ప్రభుత్వం లైట్‌గా తీసుకుంటుంది. విపత్తు సాయం, నిత్యావసర సరుకుల పంపిణీని.. రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారు-విష్ణువర్ధన్‌రెడ్డి. వైసీపీ నేతలకు సహకరిస్తున్న అధికారులను తొలగించాలి. ఏపీలో కరోనా కేసులు పెరగడానికి కారణం అంజాద్‌బాషా, ముస్తాఫానే. తక్షణమే అంజాద్‌బాషా తన పదవికి రాజీనామా చేయాలి -ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి.c
  • కరోనాపై మనమంతా కలిసికట్టుగా పోరాటాన్ని కొనసాగిద్దాం. రా.9 గంటలకు దీపాలు వెలిగించి కరోనా చీకట్లను పారద్రోలడంతో పాటు.. భారతీయులమంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నామని చాటిచెబుదాం. ఈ ప్రయత్నం ద్వారా కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న.. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావాన్ని తెలుపుదాం. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కరోనాపై పోరాటాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగిద్దాం -ట్విట్టర్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • రైతు చెంతకే వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం-కన్నబాబు. గ్రామ సచివాలయ వాలంటీర్లకు సమాచారం ఇస్తే.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తాం-మంత్రి కన్నబాబు. టమోటా, అరటిని మార్కెటింగ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నాం. ధర పడిపోయిన చోట్ల ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. మామిడి ధరలు పడిపోకుండా చూడాలని అధికారులను ఆదేశించాం. పంట దిగుబడుల క్యాలెండర్‌ను రూపొందిస్తున్నాం-మంత్రి కన్నబాబు. టీడీపీ నేతలు కరోనాను కూడా రాజయకీయంగా వాడుకుంటున్నారు. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకోండి-మంత్రి కన్నబాబు.

యూరప్‌లో కోరలు చాచిన కరోనా పిశాచి వైరస్‌ను అంటించిన బ్రిటన్‌ వ్యాపారి

How Briton on a business trip spread coronavirus around Europe, యూరప్‌లో కోరలు చాచిన కరోనా పిశాచి వైరస్‌ను అంటించిన బ్రిటన్‌ వ్యాపారి

 

కరోనా పిశాచికి అడ్డూ అదుపూ లేకుండాపోతోంది.. ప్రపంచదేశాల్లో భయానకాన్ని సృష్టిస్తోంది.. దేశదేశాలకు విస్తరిస్తోన్న ఈ మహమ్మారి యూరప్‌ దేశాలను కూడా వదలడం లేదు.. ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్, స్పెయిన్‌లలో సుమారు ఏడుగురు కరోనాతో బాధపడుతున్నారట! అసలు వైరస్‌ రావడానికి ముఖ్య కారకుడు ఓ బ్రిటిష్‌ వ్యాపారవేత్త అట! అతడెవ్వరన్నది మాత్రం ఇంగ్లాండ్‌ వైద్యాధికారులు చెప్పడం లేదు.. ఆ వ్యాపారికి ఓ 50 ఏళ్లు ఉంటాయట! ఈ ముదనష్టపు రోగాన్ని అంటించినవారెవ్వరో చెప్పాలంటూ వైద్యాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు ప్రజలు.. అయినా వారు పెదవి విప్పకపోవడంతో ఆ వ్యాపారవేత్తను గ్రేట్‌ స్ప్రెడ్డర్‌గా పిలుచుకుంటున్నారు.. సింగపూర్‌లోని గ్రాండ్‌ హయత్‌లో జరిగిన ఓ సదస్సుకు హాజరైన ఆ బిజినెస్‌మన్‌కు అక్కడే కరోనా వైరస్‌ సోకిందంటున్నారు.. ఆ గ్రేట్‌ స్ప్రెడ్డర్‌ పోయిన్నెల 28వ తేదీన స్కై చాలెట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ లోకల్‌ ప్లేన్‌లో మాంట్‌ బ్లాంక్‌కు వెళ్లాడు.. ఆయనతో పాటు అక్కడికి వెళ్లిన అయిదుగురు బ్రిటీషర్లకు కూడా కరోనా అంటుకుంది.. మొన్న గురువారంనాడు గ్రేట్‌ స్ప్రెడ్డర్‌ లండన్‌ ఎయిర్‌పోర్ట్‌కు రాగానే జబ్బు ముదిరిపోయింది… వెంటనే అతడిని లండన్‌లోని సెయింట్‌ థామస్‌ హాస్పిటల్‌లో చేర్చి చికిత్స ఇస్తున్నారు.. ఇప్పుడాయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఎవరూ చెప్పడం లేదు.. అయితే సింగపూర్‌లో మౌంట్‌బ్లాంక్‌లో గ్రేట్‌ స్ప్రెడ్డర్‌ కారణంగా జబ్బు పడిన అయిదుగురు బ్రిటీషర్లు మాత్రం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. గ్రేట్‌ స్ప్రెడ్డర్‌ బస చేసిన మాంట్‌బ్లాంక్‌లో స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. అలాగే ఆ రోజున ఆయనతోపాటే అక్కడ్నుంచి ఉంచిన ఈజీ జెట్‌ విమానాన్ని, ఆరుగురు విమాన సిబ్బందిని, అందులో ట్రావెల్‌ చేసిన 183 మంది ప్రయాణికులను అధికారులు గుర్తించారు. తక్షణమే వైద్యపరీక్షలు చేయించుకోవాల్సిందిగా వారిని హెచ్చరించారు. బ్రిటన్‌కు వచ్చేటప్పుడు ఆ విమానం ఫ్రాన్స్‌ మీదుగా స్పెయిన్‌కు వెళ్లి వచ్చిందట! ఆ దేశాలలో దిగిన ఇద్దరు ప్రయాణికులకు కూడా కరోనా వైరస్‌ సోకిందట!

Related Tags