Breaking News
  • త్వరలో జనసేన క్రియాశీలక కార్యకర్తలతో పవన్‌ సమావేశాలు. 4 వారాల పార్టీ కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.. పార్టీ కోసం పనిచేసే వారి జాబితా తయారు చేయాలి. ఈ నెల చివరి వారం నుంచి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలు.. బీజేపీతో ప్రయాణంపై సమావేశాల్లో చర్చించనున్న పవన్‌కల్యాణ్‌. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన.. అభ్యర్థుల సమావేశం కూడా ఏర్పాటు చేయాలన్న పవన్‌కల్యాణ్‌.
  • ఇంధన పొదుపులో టీఎస్‌ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో రెండో పురస్కారం. పురస్కారాన్ని అందుకున్న ఎండీ సునీల్‌శర్మ. రాష్ట్ర స్థాయిలో మూడు డిపోలకు దక్కిన అవార్డులు.
  • చెన్నైలో రోడ్డు ప్రమాదం. బైక్‌ను ఢీకొన్న కారు, ఇద్దరు మృతి. మృతులు తెలుగు యువకులుగా గుర్తింపు. విశాఖకు చెందిన బాలమురళి, హైదరాబాద్‌కు చెందిన రాహుల్‌గా గుర్తింపు. చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న బాలమురళి, రాహుల్‌.
  • రాజ్‌కోట్‌ వన్డే: ఆస్ట్రేలియా విజయలక్ష్యం 341 పరుగులు. ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసిన భారత్‌.
  • మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అస్వస్థత. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో సోమిరెడ్డికి చికిత్స.

‘ పెట్టా ‘ టీజర్.. తలైవా అదే జోరు

, ‘ పెట్టా ‘ టీజర్.. తలైవా అదే జోరు
సూపర్‌స్టార్ రజినీకాంత్ తాజా సినిమా పెట్టా ‘ టీజర్ రిలీజయింది. బుధవారం ఆయన పుట్టినరోజు కావడంతో అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తూ యూనిట్ ఈ టీజర్ విడుదల చేసింది. ఇదే సందర్భంలో ఈ మూవీ టీమ్ తలైవాకు శుభా కాంక్షలు కూడా తెలిపింది. మోడరన్, సంప్రదాయ దుస్తుల్లో రజినీ లుక్ అదుర్స్ అంటున్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది. సిమ్రాన్, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్న ‘ పెట్టా ‘ ను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. కళానిధి మారన్ నిర్మాత.

విలన్‌గా విజయ సేతుపతి నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి కీలక పాత్ర పోషించాడు. ‘ పెట్టా ‘ లో రజినీ కాలేజీ వార్డెన్ గా, ఫ్లాష్ బ్యాక్ లో సైనిక అధికారిగా కనిపించనున్నాడని సమాచారం. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రంలోని ‘ మరణ మాస్ ‘ అనే పాటకు మంచి స్పందన లభించింది.