Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

, నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి:దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిసాయి. బాంబే స్టాక్‌ ఎక్స్‌ఛేంజి సూచీ సెన్‌సెక్స్‌ 241 పాయింట్ల నష్టంతో 36153 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ సూచీయైన నిఫ్టీ కూడా 57 పాయింట్లు నష్టపోయి 10831 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికన్‌ డాలరుతో రూపాయి విలువ 71.17గా ఉంది. నేటి మార్కెట్‌ను ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ రంగ షేర్లు కుంగదీశాయి.

యూనియన్‌ బ్యాంక్‌ షేర్లు 1.75శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసు సుచీ 1.09శాతం కుంగాయి. మరోపక్క ఎడల్‌వైజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసు, హెచ్‌డీఎప్‌సీ షేర్లు కూడా నష్టపోయాయి. గుజరాత్‌ నర్మదా వ్యాలీ ఫర్టిలైజర్స్‌ షేర్లు 12శాతం పడిపోయాయి. ఈ కంపెనీ లాభంలో 27 శాతం కుంగటం దీనికి ప్రధాన కారణం. మరోపక్క హిందాల్కో లాభం కూడా మూడో త్రైమాసికంలో 37శాతం తగ్గింది., నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు