Breaking News
  • గుంటూరు: చిలకలూరిపేటలో జేఏసీ నిరసన దీక్ష. దీక్షను ప్రారంభించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది-ప్రత్తిపాటి. నాపై, నారాయణపై ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టారు. కోర్టులో ఈ ప్రభుత్వానికి పరాభవం తప్పదు-ప్రత్తిపాటి.
  • అమరావతి: ఏపీలో నిరంకుశ పాలన నడుస్తోంది-కొల్లు రవీంద్ర. మండలి చైర్మన్‌ షరీఫ్‌పై మంత్రుల వ్యాఖ్యలు సరికాదు. సీఎం జగన్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు-మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.
  • విశాఖ: తహశీల్దార్‌ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు. సబ్బవరం, భీమిలి తహశీల్దార్‌ కార్యాలయాల్లో సోదాలు.
  • ప.గో: 13 జిల్లాలు అభివృద్ధే సీఎం జగన్‌ ఆశయం-సామినేని ఉదయభాను. అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ రెండూ జరగాలి. మండలి చైర్మన్‌ బిల్లులను సలెక్టు కమిటీ పంపడం సరికాదు. దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి ఆలస్యం అవుతుంది-సామినేని ఉదయభాను.
  • అమరావతి: సా.4 గంటలకు గవర్నర్‌తో భేటీకానున్న చంద్రబాబు. మండలిలో జరిగిన పరిణామాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న బాబు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని విజ్ఞప్తి. మండలి చైర్మన్‌పై మంత్రులు, వైసీపీ సభ్యుల తీరుపై ఫిర్యాదు. మండలి రద్దు, రాజధాని అంశం, మీడియాపై కేసులను.. గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లనున్న చంద్రబాబు.

దేశమంతా ఒకటే మాట.. మరో భారీ ప్లాన్ సిద్ధం!

, దేశమంతా ఒకటే మాట.. మరో భారీ ప్లాన్ సిద్ధం!

న్యూఢిల్లీ: ఇప్పుడు దేశమంతా ఒకటే మాట వినిపిస్తోంది. జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడికి పాల్పడి 42 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నవారని అంతం చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ వంటి వారితో సహా తగిన గుణపాఠం చెబుతామని వెల్లడించారు. దీంతో ఈ నేపథ్యంలో అంతా సర్జికల్ స్ట్రైక్స్ పైకి చర్చ మళ్లింది.

గతంలో 2016లో ఉరి ఉగ్రదాడి ఘటనకు బదులుగా భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ జరిపి ప్రతీకారం తీర్చుకుంది. శత్రు స్థావరంలోకి ప్రవేశించి మరీ ఉగ్ర మూకలను మట్టుపెట్టింది. ఈసారి కూడా ఈ విధంగానే ఏదొకటి జరిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఉరి ఘటన సమయంలో ముందుగా పలు అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ తీరును ప్రధాని ఎండగట్టారు.

ఆయనతో పాటు పలువురు జాతీయ నాయకులు కూడా పలు సందర్భాల్లో పాకిస్థాన్ తీరును ప్రపంచానికి తెలిసేలా మాట్లాడారు. పిరికిపంద చర్య అంటూ మండిపడ్డారు. అనంతరం పథకం ప్రకారం సర్జికల్ స్ట్రైక్స్ జరిపి దెబ్బకు దెబ్బ తీశారు. దీంతో పాక్‌కు షాకిచ్చి తగిన బుద్ధి చెప్పారు. ఈసారి కూడా అదే తరహాలో ఏదొకటి జరగాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.