Breaking News
  • తూ.గో: పెద్దాపురంలో దారుణం. యర్రా శివశంకర్‌ అనే వ్యక్తిపై నగేష్‌ కత్తితో దాడి. పరిస్థితి విషమం, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు.
  • అమరావతి: ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. ప్రలోభాలకు లొంగలేదనే మండలి రద్దు తీర్మానం చేశారు. సెలెక్ట్‌ కమిటీ అంటే జగన్‌కు ఎందుకంత భయం. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఎందుకు విచారణ జరపలేదు -ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు.
  • మద్దాల గిరిని ఆర్థికంగా బెదిరించి పార్టీలోకి లాక్కున్నారు.
  • 11 మంది భారతీయ మత్స్యకారులను బంధించిన శ్రీలంక. ఒక పడవను స్వాధీనం చేసుకున్న శ్రీలంక నేవీ సిబ్బంది.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం. 16 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.02 కోట్లు. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 44,366 మంది భక్తులు.
  • సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ బదిలీ. అమోయ్‌ కుమార్‌ను రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు. నేరేడుచర్ల ఇంచార్జి కమిషనర్‌ మహేందర్‌రెడ్డి సస్పెన్షన్‌. తహశీల్దార్‌ రాంరెడ్డికి ఇంచార్జి బాధ్యతలు. కేవీపీ ఓటు విషయంలో అధికారుల తీరుపై ప్రభుత్వం చర్యలు.

దమ్ముందా ఇమ్రాన్ ఖాన్?: పంజాబ్ సీఎం

, దమ్ముందా ఇమ్రాన్ ఖాన్?: పంజాబ్ సీఎం

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిపై స్పందించిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను దమ్ముంటే మాట మీద నిలబడాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. తమపై అనవసరంగా నిందలు వేయొద్దని, ఆధారాలు చూపిస్తే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు నాదీ హామీ అని ఇమ్రాన్ ఖాన్ చెప్పిన సంగతి తెలిసందే. దీంతో దీనిపై అమరీందర్ సింగ్ స్పందిస్తూ మాట మీద నిలబడాలని సవాల్ చేశారు.

ఆధారాలు ఇంకేం కావాలి, దాడి చేసిందే తామేనని జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ప్రకటించింది కదా, దాని బాస్ పాక్‌లోనే ఉన్నాడుగా అని అన్నారు. ముందు అతన్ని పట్టుకోవాలని, లేదంటే భారతే చర్యలు తీసుకుంటుందని చెప్పారు. భారత ఆర్మీ మట్టుపెట్టిన ఉగ్రవాదులను చూసైనా పాకిస్థాన్ తన తీరును మార్చుకోవాలని, తమ జవాను ఒకరు చనిపోతే అందుకు బదులుగా మీ జవాన్లను ఇద్దరిని హతమారుస్తామని అమరీందర్ సింగ్ ఘాటుగా స్పందించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా అందుకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతు తెలుపుతామని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ వెల్లడించారు.