Breaking News
  • విజయనగరం: కొత్తవలస మండలం అప్పనపాలెంలో రోడ్డుప్రమాదం. ఆటోను ఢీకొన్న కారు, నలుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • అమరావతి: రేపు టీడీఎల్పీ సమావేశం. మంగళగిరి టీడీపీ కార్యాయలంలో ఉ.10:30కి సమావేశం. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. మధ్యాహ్నం నుంచి ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం.
  • ఢిల్లీ: నిర్భయ కేసు. న్యాయవాది ఏపీ సింగ్‌కు బార్‌ కౌన్సిల్‌ నోటీసులు. రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశం. న్యాయవాది ఏపీ సింగ్‌పై విచారణకు ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు. నిర్భయ దోషుల తరఫున వాదిస్తున్న ఏపీ సింగ్.
  • నల్గొండ: మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓట్లు అడిగే హక్కులేదు-ఉత్తమ్‌. 40 లక్షల మంది ఎస్సీలకు కేబినెట్‌లో మంత్రి పదవి లేదు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు షాక్‌ తప్పదు-ఉత్తమ్‌కుమార్‌.
  • ఓయూ అసిస్టెంట్‌ ప్రొ.కాశిం ఇంటిపై పోలీసుల దాడిని ఖండించిన సీపీఐ. కాశిం ఇంటిపై పోలీసుల దాడి అప్రజాస్వామికం-చాడ వెంకట్‌రెడ్డి. రాష్ట్రంలో పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది. కాశిం ఇంట్లో సోదాలను వెంటనే నిలిపివేయాలి-చాడ వెంకట్‌రెడ్డి.

తిమింగలాలకి ఫుడ్ షేర్ చేసుకోవడం ఇష్టమట..! నిజమేనా..?

, తిమింగలాలకి ఫుడ్ షేర్ చేసుకోవడం ఇష్టమట..! నిజమేనా..?

తిమింగలాలు ఫుడ్ షేర్ చేసుకోవడమేంటని ఆలోచిస్తున్నారా..? అంత క్రూర జంతువు అందరితో కలిసి తింటుందా..? ఇవేగా మీ డౌంట్స్..? మరింకెందుకు ఆలస్యం చదివేయండి..

రీసెర్చ్ లో భాగంగా మరాయిన్ స్పెషలిస్ట్ రెజీనా న్యూజిలాండ్ లోని అంటార్కిటిక్ సముద్రంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె కెమెరాతో సముద్రంలోని వింతలను వీడియో తీస్తుండగా.. అటుగా వచ్చిన ఓ చిన్న తిమింగలం కిల్లర్ వేల్ రెజీనా ఎల్సెర్ట్ ఉన్న వైపు వచ్చి ఒక శాస్త్రవేత్త తలపై ఉన్న కెమెరాను నోటితో లాగేసింది. ఆ తరువాత దాని నోటిలో ఉన్న టూత్ ఫిష్ కొంచెం వదిలి వెళ్లింది. కాగా.. ఆ కిల్లర్ వేల్ వచ్చి రెజీనా ఎల్సెర్ట్ కెమెరాకు ముద్దు పెట్టి వెనుతిరిగి వెళ్లింది.

దీన్ని చూసి రెజీనా ఎల్సెర్ట్ చాలా ఆనందం వ్యక్తం చేసింది. తిమింగలాలకు ఫుడ్ షేర్ చేసుకోవడం చాల ఇష్టమంట. మొదట నేను దీన్ని నమ్మలేదు. కానీ ఇప్పుడు నమ్ముతున్నాని వీడియోను చూపిస్తూ తమ సంతోషాన్ని పంచుకున్నారు.

కాగా.. ఎల్సెర్ట్ ఓర్కా వద్దకు వెళ్లేటప్పటికి సముద్రపు మంచు అంచున అది నిలబడి ఉంది. ఇది నిజంగా ఒక ప్రత్యేకమైన వీడియో. ఒక పిల్లి మీకు ఎలుకను పట్టి చూపించినట్లుగా నాకు ఇది దొరికింది. దాని ముక్కుతో కెమెరా ముద్దుపెట్టుకోవడం చేసింది. అలాగే.. దాని నోటిని తెరిచి, దాని నోటిలోని టూత్ ఫిష్ భాగాన్ని సగం తిని వదిలేయడం, దాని పెద్ద పళ్లభాగాన్ని చూపించడాన్ని ఆమె వివరించారు.

గతవారం అంటార్కిటికా న్యూజిలాండ్ సంస్థ ఇక్కడ కొన్ని పరిశోధనలు చేస్తూ, అలాగే ప్రభుత్వ వాతావరణాన్ని అధ్యయనం చేస్తూ.. పర్యవరణ పరిరక్షణను చేపట్టింది. ఈ టైంలో రెజీనా ఎల్సెర్ట్ కి ‘Whalfie stick’ ఏర్పాటు చేసే సమయం దొరికింది.

కాగా.. రాస్ సీ సముద్రం మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాలో ఈ సీజన్ కోసం ఆమె పరిశోధనను పూర్తి చేసింది. ఈ ప్రాంతంలో ఓర్కాస్ యొక్క ఆహారాన్ని ఆమె అధ్యయనం చేస్తోంది. అలాగే.. టూత్ ఫిష్ తిమింగలాలు ఎలా తింటుంది, దాని వల్ల ఎలాంటి ఎలాంటి లాభాలు ఉన్నాయో ఆమె రీసెర్చ్ చేస్తున్నారు.

మరాయిన్ స్పెషలిస్ట్ రెజీనా ఎల్సెర్ట్  ‘రాస్ సీ’ పర్యవరణాన్ని కాపాడటానికి ఆమె ప్రత్యేకంగా రీసెర్చ్ లు చేస్తూంటారు. అలాగే తిమింగలాలు టూత్ ఫిష్ ని తింటాయో లేదా తెలుసుకోవడానికి పరిశోధన చేస్తున్నారు. దీంతో ఆమె అనుమానం తీరింది.