Breaking News
  • త్వరలో జనసేన క్రియాశీలక కార్యకర్తలతో పవన్‌ సమావేశాలు. 4 వారాల పార్టీ కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.. పార్టీ కోసం పనిచేసే వారి జాబితా తయారు చేయాలి. ఈ నెల చివరి వారం నుంచి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలు.. బీజేపీతో ప్రయాణంపై సమావేశాల్లో చర్చించనున్న పవన్‌కల్యాణ్‌. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన.. అభ్యర్థుల సమావేశం కూడా ఏర్పాటు చేయాలన్న పవన్‌కల్యాణ్‌.
  • ఇంధన పొదుపులో టీఎస్‌ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో రెండో పురస్కారం. పురస్కారాన్ని అందుకున్న ఎండీ సునీల్‌శర్మ. రాష్ట్ర స్థాయిలో మూడు డిపోలకు దక్కిన అవార్డులు.
  • చెన్నైలో రోడ్డు ప్రమాదం. బైక్‌ను ఢీకొన్న కారు, ఇద్దరు మృతి. మృతులు తెలుగు యువకులుగా గుర్తింపు. విశాఖకు చెందిన బాలమురళి, హైదరాబాద్‌కు చెందిన రాహుల్‌గా గుర్తింపు. చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న బాలమురళి, రాహుల్‌.
  • రాజ్‌కోట్‌ వన్డే: ఆస్ట్రేలియా విజయలక్ష్యం 341 పరుగులు. ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసిన భారత్‌.
  • మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అస్వస్థత. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో సోమిరెడ్డికి చికిత్స.

ట్రైన్ 18 ప్రయాణికులకు స్టార్ హోటల్ రుచులు

, ట్రైన్ 18 ప్రయాణికులకు స్టార్ హోటల్ రుచులు

ఈ నెల 15వతేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్న ట్రైన్ 18లోని ప్రయాణికులు స్టార్ హోటల్ వంటకాలు రుచిచూడనున్నారు. భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరొందిన ట్రైన్ 18 ప్రయాణికులకు ఫైవ్ స్టార్ హోటల్ భోజనం పంపిణీ చేయాలని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) నిర్ణయించింది.  ట్రైన్ 18 కు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ గా పేరు పెట్టారు

ఢిల్లీ నుంచి వారణాసి వరకు నడపనున్న ఈ రైలులో ప్రయాణించే వారికి అలహాబాద్ నగరంలోని ఉన్నతస్థాయి రెస్టారెంట్ నుంచి అల్పాహారం, కాన్పూర్ నగరంలోని ఫైవ్ స్టార్ హోటల్ నుంచి భోజనం తెప్పించి వడ్డించాలని ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది.

గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైలులో ప్రయాణికులు 8 గంటల్లో తమ గమ్య స్థానానికి చేరుకుంటారు.

, ట్రైన్ 18 ప్రయాణికులకు స్టార్ హోటల్ రుచులు