Breaking News
  • త్వరలో జనసేన క్రియాశీలక కార్యకర్తలతో పవన్‌ సమావేశాలు. 4 వారాల పార్టీ కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.. పార్టీ కోసం పనిచేసే వారి జాబితా తయారు చేయాలి. ఈ నెల చివరి వారం నుంచి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలు.. బీజేపీతో ప్రయాణంపై సమావేశాల్లో చర్చించనున్న పవన్‌కల్యాణ్‌. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన.. అభ్యర్థుల సమావేశం కూడా ఏర్పాటు చేయాలన్న పవన్‌కల్యాణ్‌.
  • ఇంధన పొదుపులో టీఎస్‌ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో రెండో పురస్కారం. పురస్కారాన్ని అందుకున్న ఎండీ సునీల్‌శర్మ. రాష్ట్ర స్థాయిలో మూడు డిపోలకు దక్కిన అవార్డులు.
  • చెన్నైలో రోడ్డు ప్రమాదం. బైక్‌ను ఢీకొన్న కారు, ఇద్దరు మృతి. మృతులు తెలుగు యువకులుగా గుర్తింపు. విశాఖకు చెందిన బాలమురళి, హైదరాబాద్‌కు చెందిన రాహుల్‌గా గుర్తింపు. చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న బాలమురళి, రాహుల్‌.
  • రాజ్‌కోట్‌ వన్డే: ఆస్ట్రేలియా విజయలక్ష్యం 341 పరుగులు. ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసిన భారత్‌.
  • మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అస్వస్థత. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో సోమిరెడ్డికి చికిత్స.

టిక్ టాక్ యాప్ పై నిషేదం

, టిక్ టాక్ యాప్ పై నిషేదం

ప్రస్తుతం ఎవరి వాట్సాప్ స్టాటస్ లో చూసినా టిక్ టాక్ లో చేసిన వీడియోస్ నే కనిపిస్తున్నాయి. ఎవరు చూడు టిక్ టాక్ అంటూ ఆఫీస్ లలోనూ, ఇళ్లల్లోనూ, ఆఖరికి రోడ్ల మీద కూడా వీటినే చేస్తున్నారు. ఈ టిక్ టాక్ తో ఎంతలా అలవాటు పడిపోయారంటే ఇటీవలె తమిళనాడులో ఓ కుర్రాడు ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి యాప్ లు శాంతిభద్రతలకు విఘాతమని భావించిన తమిళనాడు ప్రభుత్వం ఈ యాప్ ను నిషేదించాలని నిర్ణయం తీసుకుంది. మనిదనేయ జననాయగ కట్చి శాసనసభ్యుడు తమీమున్‌ హన్సారీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చ సందర్భంగా టిక్ టాక్ యాప్ ను తక్షణమే నిషేదించాలని కోరారు. ఈ యాప్ లో కుల, మతాల మధ్య హింసను రెచ్చగొట్టే సంభాషణలు, అలాగే అశ్లీల దృశ్యాలు ఉన్నాయని అన్నారు. కాగా.. తమిళనాడు సమాచారశాఖ మంత్రి మణికంఠన్ దీనిపై కేంద్రంతో మాట్లాడి చర్యలు తీసుకొస్తామని తెలియజేశారు.