Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

టాలీవుడ్‌కు రేణు రీ ఎంట్రీ

, టాలీవుడ్‌కు రేణు రీ ఎంట్రీ

హైదరాబాద్‌:ప్రముఖ సినీ నటుడు, పొలిటికల్ లీడర్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ మళ్లీ నటనపై దృష్టి పెట్టారు. గత కొంత కాలంగా నటనకు దూరంగా ఉన్న ఆవిడ తాజాగా రెండు కొత్త ప్రాజెక్టులకు సంతకం చేశారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ మంగళవారం సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. ‘ఓ సినిమాకు సంతకం చేశానని మీకు చెప్పడం సంతోషంగా ఉంది. నేను చాలా ప్రత్యేకమైన పాత్రను పోషించబోతున్నా. వంశీ కృష్ణ (‘దొంగాట’ ఫేం) దర్శకత్వం వహిస్తున్న సినిమాలో సామాజిక వేత్త, రచయిత హేమలత లవణం గారి పాత్రలో నటించబోతున్నా. వ్యక్తిగతంగా నాకు ఆమెపై చాలా అభిమానం ఉంది. వెండితెరపై ఆమె పాత్రను పోషించడం గౌరవంగా భావిస్తున్నా. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలోనే చెబుతా’.

‘ఇది కాకుండా మరో ముఖ్యమైన ప్రాజెక్టుకు కూడా సంతకం చేశా. వచ్చే వారం ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నా’ అని రేణు పోస్ట్‌లో పేర్కొన్నారు. హేమలత లవణం అంటరానితనం, వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. తన భర్త లవణంతో కలిసి ‘సంస్కార్‌’ అనే సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా పనిచేశారు.

పూరీ జగన్నాథ్‌ ‘బద్రి’ సినిమాతో రేణు నటిగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. తర్వాత ‘జాని’ సినిమాలో నటించారు. ‘ఖుషి’, ‘జాని’, ‘గుడుంబా శంకర్‌’, ‘బాలు’, ‘అన్నవరం’ సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేశారు. 2014లో ‘ఇష్క్‌ వాలా లవ్‌’ అనే మరాఠీ సినిమాతో మెగాఫోన్ కూడా పట్టారు. కాగా రేణు రీ ఎంట్రీ ఆమె ఫ్యాన్స్ హ్యపీగా ఫీల్ అవుతున్నారు.