Breaking News
  • విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర ఉద్రిక్తత. ధర్నాచౌక్‌ నుంచి మందడం బయల్దేరిన కర్నాటక రైతులు. అనుమతిలేదంటూ ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర అడ్డుకున్న పోలీసులు.
  • చంద్రబాబుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భేటీ. అమరావతి కార్యాచరణపై చర్చ.
  • మైలవరం ఫారెస్ట్ అధికారిపై వైసీపీ మండలాధ్యక్షుడు దాడికియత్నం. అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ అధికారి . ఫారెస్ట్‌ అధికారితో వాదనకు దిగిన వైసీపీ నేత పామర్తి శ్రీను.
  • ప.గో: చంద్రబాబుది యూటర్న్‌ గవర్నమెంట్‌ అయితే.. జగన్‌ది రద్దుల గవర్నమెంట్‌. మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోయి.. మండలిలోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు అడుకుంటున్నారు. రాజకీయ పునరావాసానికి మండలి వేదికగా మారింది-బీజేపీ నేత అంబికా కృష్ణ.
  • తూ.గో: తునిలో కారులో ఇరుక్కున్న మూడేళ్ల బాలుడు. మూడేళ్ల బాబును కారులో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు. కారు డోర్లు లాక్‌ కావడంతో ఉక్కిరిబిక్కిరైన బాలుడు. కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని కాపాడిన స్థానికులు.

జెట్ ఎయిర్‌వేస్ మళ్లీ రైజ్ అవుతుందా?

, జెట్ ఎయిర్‌వేస్ మళ్లీ రైజ్ అవుతుందా?

అప్పులతో సతమతమవుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ను తిరిగి ట్రాక్ లో పెట్టడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ మేరకు గురువారం జరిగిన బోర్డు సమావేశంలో సంస్థ ఓ కీలక నిర్ణయం తీసుకొంది. బ్యాంకు నేతృత్వంలో తాత్కాలిక రుణ పరిష్కార ప్రణాళికను (బీఎల్‌పీఆర్‌పీ) సిద్ధం చేసింది. దీని ప్రకారం, సంస్థ రుణదాతలకు చెల్లించాల్సిన బకాయిలను ఈక్విటీ రూపంలోకి మార్చుకునేందుకు మార్గం సుగమం కానుంది. ఇదే జరిగితే కంపెనీలో రుణదాతలు అత్యధిక వాటాదార్లు అవుతారు. అప్పుడు కంపెనీ వారి చేతుల్లోకి వెళ్లినట్లు అవుతుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గత ఏడాది ఫిబ్రవరి 12న జారీ చేసిన సర్క్యులర్‌ ప్రకారం, తమకున్న రూ.8,500 కోట్ల నిధుల అంతరాన్ని పూడ్చుకునేందుకు రుణ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా బోర్డు తాజా ప్రతిపాదనను తీసుకొచ్చింది. దీని ప్రకారం, అప్పు ఇచ్చినవాళ్లకు చెల్లించాల్సిన రుణాన్ని ఒక్కో షేర్ రూ.10 చొప్పున  11.40 కోట్ల షేర్లుగా విభజించి వారికి కేటాయించాలని భావిస్తోంది. దీంతో సంస్థలో రుణదాతలు అతి పెద్ద వాటాదార్లుగా అవతరించే అవకాశం ఉందని ఎక్స్ఛేంజీలకు జెట్‌ ఎయిర్‌వేస్‌ సమాచారమిచ్చింది.

ఈ రుణ పరిష్కార ప్రణాళిక కింద రుణదాతల నామినీలు కూడా డైరెక్టర్ల బోర్డులో సభ్యులుగా ఉంటారు. ఈ నెల 21న నిర్వహించబోయే సమావేశంలో వాటాదార్ల అనుమతి మేరకు ఈ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లనున్నారు. తాజాగా ప్రతిపాదించిన తాత్కాలిక రుణ పరిష్కార ప్రణాళికకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, కాంపిటీషన్‌ కమిషన్‌ ఆప్‌ ఇండియా (సీసీఐ)లు అనుమతిస్తే అమలు చేస్తామని కంపెనీ వెల్లడించింది. ఇదిలా ఉంటే, 2018 డిసెంబరు 31 నాటికి జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రమోటర్‌ నరేశ్‌ గోయల్‌కు సంస్థలో 51 శాతం వాటా ఉండగా, ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌కు 24 శాతం వాటా ఉంది. 2018 సెప్టెంబరు నాటికి సంస్థకు రూ.8,052 కోట్ల రుణ భారం ఉంది.