Breaking News
  • కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు చంద్రబాబు లేఖ. నరేగా పెండింగ్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని వినతి. ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ.. నిధులు విడుదల చేయకుండా పెండింగ్‌లో ఉంచింది. గతంలో నరేగా పనులు చేసినవారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది -లేఖలో చంద్రబాబు.
  • పదేళ్లలో జమ్మికుంట-హుజూరాబాద్‌ నగరాలు కలిసిపోతాయి. జంట నగరాలకు మున్సిపల్ చైర్మన్లుగా టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలుస్తారు. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా.. కేసీఆర్‌ నన్ను నియమించారు-వినోద్‌కుమార్‌. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలి -ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్.
  • కడప: పోరుమామిళ్ల మండలం మార్కాపురం దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీకొని సిలాస్‌ అనే వ్యక్తికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • నగరపాలక, మున్సిపల్‌ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేశాం. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో రేపు ఓట్ల లెక్కింపు. ఈ నెల 27న మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నికకు పరోక్ష ఎన్నికలు. ఈనెల 29న కరీంనగర్‌ మేయర్‌ ఎన్నిక-నాగిరెడ్డి. రేపు సాయంత్రంలోగా అన్ని ఫలితాలు వస్తాయి. పార్టీలు మేయర్‌, చైర్‌పర్సన్ల పేర్లను ఏ, బీ ఫారాల ద్వారా ఇవ్వాలి. ఈ నెల 26న ఉ.11 గంటలలోగా ఏ ఫామ్‌ ఇవ్వాలి. ఈ నెల 27న ఉ.11 గంటలలోగా బీ ఫామ్‌ ఇవ్వాలి -తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి.
  • శాసనమండలి తీరుపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఆగ్రహం. మంచి వ్యక్తితో తప్పుడు పనిచేయించిన చంద్రబాబును ఎవరూ క్షమించరు. వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని అడిగే హక్కు టీడీపీకి లేదు. ముందు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. ఎన్నికలకు వెళ్లాలి -ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.

జాతీయ బ్యాడ్మింటన్ నేటి నుంచే

, జాతీయ బ్యాడ్మింటన్ నేటి నుంచే

గువాహటి: జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. స్టార్‌ షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌ల ఆకర్షణ నడుమ జాతీయ టోర్నీ మంగళవారం ప్రారంభంకానుంది. గతేడాది ఫైనల్లో హోరాహోరీ పోరాటంతో ఆకట్టుకున్న సింధు, సైనా మరోసారి అమీతుమీ తేల్చుకోనున్నారు. నాలుగో సారి జాతీయ ఛాంపియన్‌గా నిలవాలని సైనా.. మూడో మారు ట్రోఫీ అందుకోవాలని సింధు పట్టుదలగా ఉండటంతో వీరిద్దరి పోరుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మహిళల సింగిల్స్‌లో సింధు టాప్‌ సీడ్‌గా..సైనా రెండో సీడ్‌గా బరిలో దిగుతున్నారు.

పురుషుల సింగిల్స్‌లో గతేడాది ఫైనలిస్టులు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, కిడాంబి శ్రీకాంత్‌ గాయాలతో టోర్నీకి దూరమయ్యారు. ఈ ఇద్దరి గైర్హాజరీతో సమీర్‌ వర్మ, సాయి ప్రణీత్‌, పారుపల్లి కశ్యప్‌ టైటిల్‌ రేసులోకొచ్చారు. గతేడాది ఈ టోర్నీ ఫైనల్లో సింధును ఓడించిన సైనా.. ఆ తర్వాత కామన్వెల్త్‌ క్రీడల టైటిల్‌ పోరులోనూ అదే ఫలితాన్ని రిపీట్ చేసింది. దీంతో ఈసారి ఎలాగైనా సైనాపై గెలవాలని సింధు పట్టుదలగా ఉంది.

ఈ నేపథ్యంలో ఫైనల్‌ చేరితే ఇద్దరి మధ్య పోరు మరోసారి అభిమానులను కనువిందు చేస్తుందనడంలో సందేహం లేదు. టోర్నీ నిబంధనల ప్రకారం ప్రపంచ 50వ ర్యాంకులోపు ఉన్న టాప్‌ ఎనిమిది మంది షట్లర్లు నేరుగా ప్రీక్వార్టర్స్‌ నుంచి బరిలోకి దిగుతారు. దీంతో మహిళల సింగిల్స్‌ నుంచి సింధు, సైనా, శ్రేయాంశి పర్దేశి, అష్మిత, కనిక కన్వాల్‌, అరుణ ప్రభుదేశాయ్‌, సాయి ఉత్తేజితరావు, ఆకర్షి కశ్యప్‌.. పురుషుల సింగిల్స్‌లో సమీర్‌ వర్మ, సాయి ప్రణీత్‌, కశ్యప్‌, శుభాంకర్‌ డే, అన్సల్‌ యాదవ్‌, చిరాగ్‌ సేన్‌, బోధిత్‌ జోషి, కార్తీక్‌ జిందాల్‌ ప్రీక్వార్టర్స్‌తో తమ పోరును ఆరంభించనున్నారు. మంగళవారం క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు జరగనుండగా.. బుధవారం నుంచి మెయిన్‌ డ్రా పోటీలు జరుగుతాయి.