Breaking News
  • గుంటూరు: చిలకలూరిపేటలో జేఏసీ నిరసన దీక్ష. దీక్షను ప్రారంభించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది-ప్రత్తిపాటి. నాపై, నారాయణపై ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టారు. కోర్టులో ఈ ప్రభుత్వానికి పరాభవం తప్పదు-ప్రత్తిపాటి.
  • అమరావతి: ఏపీలో నిరంకుశ పాలన నడుస్తోంది-కొల్లు రవీంద్ర. మండలి చైర్మన్‌ షరీఫ్‌పై మంత్రుల వ్యాఖ్యలు సరికాదు. సీఎం జగన్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు-మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.
  • విశాఖ: తహశీల్దార్‌ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు. సబ్బవరం, భీమిలి తహశీల్దార్‌ కార్యాలయాల్లో సోదాలు.
  • ప.గో: 13 జిల్లాలు అభివృద్ధే సీఎం జగన్‌ ఆశయం-సామినేని ఉదయభాను. అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ రెండూ జరగాలి. మండలి చైర్మన్‌ బిల్లులను సలెక్టు కమిటీ పంపడం సరికాదు. దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి ఆలస్యం అవుతుంది-సామినేని ఉదయభాను.
  • అమరావతి: సా.4 గంటలకు గవర్నర్‌తో భేటీకానున్న చంద్రబాబు. మండలిలో జరిగిన పరిణామాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న బాబు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని విజ్ఞప్తి. మండలి చైర్మన్‌పై మంత్రులు, వైసీపీ సభ్యుల తీరుపై ఫిర్యాదు. మండలి రద్దు, రాజధాని అంశం, మీడియాపై కేసులను.. గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లనున్న చంద్రబాబు.

కపిల్‌దేవ్‌ బయోపిక్‌

, కపిల్‌దేవ్‌ బయోపిక్‌

లెజెండరీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ రాబోతున్న సంగతి తెలిసిందే. ‘83’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌కు కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 1983లో కపిల్‌ దేవ్‌ సారథ్యంలో టీమిండియా ప్రపంచ కప్‌ను ఎలా సాధించింది? అన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కపిల్‌ దేవ్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నాడు.

అయితే మరో లెజండరీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు తహీర్‌ రాజ్‌ భాసిన్‌ నటిస్తున్నాడు. క్రికెటర్లు సందీప్‌ పాటిల్‌ పాత్రలో ఆయన కుమారుడు చిరాగ్‌ పాటిల్‌,  శ్రీకాంత్‌ పాత్రలో తమిళ నటుడు జీవా, బల్వీందర్‌ సింగ్‌ పాత్రలో అమ్మీ విర్క్, సయ్యద్‌ కిర్మాణి పాత్రలో సాహిల్‌ ఖట్టర్‌  నటిస్తున్నారు. 2020లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.