Breaking News
  • త్వరలో జనసేన క్రియాశీలక కార్యకర్తలతో పవన్‌ సమావేశాలు. 4 వారాల పార్టీ కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.. పార్టీ కోసం పనిచేసే వారి జాబితా తయారు చేయాలి. ఈ నెల చివరి వారం నుంచి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలు.. బీజేపీతో ప్రయాణంపై సమావేశాల్లో చర్చించనున్న పవన్‌కల్యాణ్‌. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన.. అభ్యర్థుల సమావేశం కూడా ఏర్పాటు చేయాలన్న పవన్‌కల్యాణ్‌.
  • ఇంధన పొదుపులో టీఎస్‌ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో రెండో పురస్కారం. పురస్కారాన్ని అందుకున్న ఎండీ సునీల్‌శర్మ. రాష్ట్ర స్థాయిలో మూడు డిపోలకు దక్కిన అవార్డులు.
  • చెన్నైలో రోడ్డు ప్రమాదం. బైక్‌ను ఢీకొన్న కారు, ఇద్దరు మృతి. మృతులు తెలుగు యువకులుగా గుర్తింపు. విశాఖకు చెందిన బాలమురళి, హైదరాబాద్‌కు చెందిన రాహుల్‌గా గుర్తింపు. చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న బాలమురళి, రాహుల్‌.
  • రాజ్‌కోట్‌ వన్డే: ఆస్ట్రేలియా విజయలక్ష్యం 341 పరుగులు. ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసిన భారత్‌.
  • మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అస్వస్థత. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో సోమిరెడ్డికి చికిత్స.

ఎన్నికల షెడ్యూల్

, ఎన్నికల షెడ్యూల్

2019 ఎన్నికల షెడ్యూల్‌ ఈ నెల 28న వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలకు అవసరమైన పారా మిలటరీ బలగాలను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవలే సీఈసీకి నివేదించింది. క్రితంసారిలాగా కాకుండా ఈసారి 5 దశల్లోనే మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనే సంకల్పంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే షెడ్యూల్‌ను ఖరారు చేస్తోంది. ఈ నెల 28న షెడ్యూల్‌ ఖరారు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏపిలో మార్చి చివ‌ర్లో లేదా ఏప్రిట్ మొద‌టి వారంలో ఎన్నిక‌లు ఉంటాయ‌ని భావిస్తున్నారు.

ఎన్నిక‌ల షెడ్యూల్ లో కీల‌కైమ‌న కౌంటింగ్ ప్ర‌క్రియ మే మొద‌టి వారంలో ఉండే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ సారి ఏపిలో అసెంబ్లీ ఎన్నిక‌లతో పాటుగా లోక్‌స‌భ ఎన్నిక‌లు సైతం జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం 175 అసెంబ్లీ 25 లోక్ స‌భ స్థానాల‌కు ఒకే విడ‌త‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి కౌంటింగ్ ప్ర‌క్రియ మే మొద‌టి వారంలో చేప‌ట్ట‌నున్నారు.

, ఎన్నికల షెడ్యూల్