Breaking News
  • తూ.గో: పెద్దాపురంలో దారుణం. యర్రా శివశంకర్‌ అనే వ్యక్తిపై నగేష్‌ కత్తితో దాడి. పరిస్థితి విషమం, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు.
  • అమరావతి: ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. ప్రలోభాలకు లొంగలేదనే మండలి రద్దు తీర్మానం చేశారు. సెలెక్ట్‌ కమిటీ అంటే జగన్‌కు ఎందుకంత భయం. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఎందుకు విచారణ జరపలేదు -ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు.
  • మద్దాల గిరిని ఆర్థికంగా బెదిరించి పార్టీలోకి లాక్కున్నారు.
  • 11 మంది భారతీయ మత్స్యకారులను బంధించిన శ్రీలంక. ఒక పడవను స్వాధీనం చేసుకున్న శ్రీలంక నేవీ సిబ్బంది.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం. 16 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.02 కోట్లు. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 44,366 మంది భక్తులు.
  • సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ బదిలీ. అమోయ్‌ కుమార్‌ను రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు. నేరేడుచర్ల ఇంచార్జి కమిషనర్‌ మహేందర్‌రెడ్డి సస్పెన్షన్‌. తహశీల్దార్‌ రాంరెడ్డికి ఇంచార్జి బాధ్యతలు. కేవీపీ ఓటు విషయంలో అధికారుల తీరుపై ప్రభుత్వం చర్యలు.

ఈ నెల 22న ప్రేక్షకులకు డబుల్ ధమాకా

, ఈ నెల 22న ప్రేక్షకులకు డబుల్ ధమాకా

ఎన్టీఆర్ బయోపిక్స్ వార్ ముదురుతోంది. మొన్న ఎన్టీఆర్ కథానాయకుడుతో ఇప్పుడు మహానాయకుడితో, లక్ష్మీస్ ఎన్టీఆర్ యుద్ధం ప్రారంభమైంది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినీ, రాజకీయ జీవితంలోని కీలకఘట్టాలతో నటరత్న బాలకృష్ణ నిర్మాణంలో క్రిష్ దర్శకత్వంలో రెండు భాగాలు తీస్తుంటే.. ఎన్టీఆర్ జీవింలో లక్ష్మీ పార్వతి ప్రవేశం తర్వాత జరిగిన పరిణామాల ఆధారంగా రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఏదైనా వివాదానికి, సంచలనం జోడించడంలో సిద్ధహస్తుడైన దర్శకుడు రాంగోపాల్ వర్మ చేతికి ఎన్టీఆర్ జీవిత కథాంశం దొరకడంతో సోషల్ మీడియా వేధికగా చెలరేగిపోతున్నారు. సినిమా ప్రమోషన్లో తనదైన శైలిలో దూసుకుపోయే ఆర్జీవీ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆధారంగా తాను తీయబోయే సినిమాలో నిజాలే చెబుతానంటూ హైప్ క్రియేట్ చేస్తున్నారు ఆర్జీవీ. కథానాయకుడు ఆడియో రిీజ్ ఫంక్షన్ దగ్గర్నుంచీ.. కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టారు.

, ఈ నెల 22న ప్రేక్షకులకు డబుల్ ధమాకా

వర్మ ఎంత రెచ్చగొట్టినా వాటి గురించి పట్టించుకోకుండా ఎన్టీఆర్ బయోపిక్లను కూల్ గా నిర్మించేస్తున్నారు దర్శక, నిర్మాతలు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా కథానాయకుడు ఇప్పటికే విడుదల కాగా.. రెండో భాగం మహానాయకుడు రిలీజ్ డేట్ను చిత్రయూనిట్ కన్ఫామ్ చేసింది. ఈ నెల 22న సినిమా థియేటర్లోకి రానుంది. సినిమా విడుదలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

వాస్తవానికి ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ విడుదల తర్వాత జనవరి 26నే రెండో భాగం విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఆ తర్వాత ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది. నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా సినిమాను ఈ నెల 22న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.

ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెలుగు ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో నటరత్న బాలకృష్ణ నిర్మాతా అవతారమెత్తి రెండు భాగాలుగా ఎన్టీఆర్ బయోపిక్ రూపొందించారు. స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో భారీ తారాగణంతో చిత్రాలు నిర్మించారు. సంక్రాంతి సందర్బంగా జనవరి 9న మొదటి భాగం ప్రేక్షకుల ముందకు వచ్చింది. తాజా రెండో భాగం విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు చేసింది.

, ఈ నెల 22న ప్రేక్షకులకు డబుల్ ధమాకా

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశారు. రేపు ఉదయం 9.27 నిమిషాలకు లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేటర్ ట్రైలర్ రిలీజ్ చేస్తానంటూ ట్వీట్ చేశారు. ఈ నెల 22న ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా రిలీజ్ అయ్యే థియేటర్లలో లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేస్తానన్నారు. మహానాయకుడు మూవీని థియేటర్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ చూడొచ్చు అన్నారు.

మొత్తంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రమోషన్ ను తనదైన రీతిలో మహానాయకుడు సినిమా ద్వారానే చేసుకుంటానంటూ మరో కాంట్రవర్సీకి తెరదీశారు. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ కు సంబంధించి రెండు పాటలు, కొన్ని వర్కింగ్ స్టిల్స్ విడుదల చేసి కాక రేపుతున్న ఆర్జీవీ ఇప్పుడు మహానాయకుడు విడుదల సందర్బంగా తన చిత్రాన్ని ప్రమోట్ చేస్తానంటున్నారు

మరోవైపు లక్ష్మీ పార్వతి, ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడుతున్నట్లుగా ఒక ఇమేజ్ ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు ఆర్జీవీ. ప్రధాని మోడీతో లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి డిస్కర్షన్ చేస్తున్నారన్నారు.