Breaking News
  • తూ.గో: పెద్దాపురంలో దారుణం. యర్రా శివశంకర్‌ అనే వ్యక్తిపై నగేష్‌ కత్తితో దాడి. పరిస్థితి విషమం, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు.
  • అమరావతి: ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. ప్రలోభాలకు లొంగలేదనే మండలి రద్దు తీర్మానం చేశారు. సెలెక్ట్‌ కమిటీ అంటే జగన్‌కు ఎందుకంత భయం. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఎందుకు విచారణ జరపలేదు -ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు.
  • మద్దాల గిరిని ఆర్థికంగా బెదిరించి పార్టీలోకి లాక్కున్నారు.
  • 11 మంది భారతీయ మత్స్యకారులను బంధించిన శ్రీలంక. ఒక పడవను స్వాధీనం చేసుకున్న శ్రీలంక నేవీ సిబ్బంది.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం. 16 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.02 కోట్లు. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 44,366 మంది భక్తులు.
  • సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ బదిలీ. అమోయ్‌ కుమార్‌ను రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు. నేరేడుచర్ల ఇంచార్జి కమిషనర్‌ మహేందర్‌రెడ్డి సస్పెన్షన్‌. తహశీల్దార్‌ రాంరెడ్డికి ఇంచార్జి బాధ్యతలు. కేవీపీ ఓటు విషయంలో అధికారుల తీరుపై ప్రభుత్వం చర్యలు.

ఇలా ఓపెన్ చేయగానే.. అలా ఫాలోవర్లు వచ్చేశారు

, ఇలా ఓపెన్ చేయగానే.. అలా ఫాలోవర్లు వచ్చేశారు
ఇటీవలే ప్రత్యక్ష  రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక గాంధీ తాజాగా సోషల్ మీడియాలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. సోమవారం ప్రియాంక తన పేరు మీద అధికారిక ట్విట్టర్ ఖాతాను ప్రారంభించగా.. కొద్ది క్షణాల్లోనే ఆమె ఫాలోవర్లు వేలకు చేరారు. ప్రస్తుతం ఆమెను 65.5వేల మంది ఫాలో అవుతుండగా.. ఆమె ఏడుగురిని ఫాలో అవుతోంది. అందులో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, రణ్‌దీప్ సుర్జేవాలా, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు.
, ఇలా ఓపెన్ చేయగానే.. అలా ఫాలోవర్లు వచ్చేశారు
కాగా ఇప్పటివరకు ప్రియాంక  ఎలాంటి ట్వీట్ చేయలేదు. మరోవైపు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంకకు ఆమె భర్త రాబర్ట్ వాద్రా అభినందనలు తెలిపారు. పొలిటికల్ ఎంట్రీతో ప్రియాంక పరిపూర్ణ మహిళగా మారిందంటూ ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు.