Breaking News
  • తూ.గో: పెద్దాపురంలో దారుణం. యర్రా శివశంకర్‌ అనే వ్యక్తిపై నగేష్‌ కత్తితో దాడి. పరిస్థితి విషమం, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు.
  • అమరావతి: ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. ప్రలోభాలకు లొంగలేదనే మండలి రద్దు తీర్మానం చేశారు. సెలెక్ట్‌ కమిటీ అంటే జగన్‌కు ఎందుకంత భయం. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఎందుకు విచారణ జరపలేదు -ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు.
  • మద్దాల గిరిని ఆర్థికంగా బెదిరించి పార్టీలోకి లాక్కున్నారు.
  • 11 మంది భారతీయ మత్స్యకారులను బంధించిన శ్రీలంక. ఒక పడవను స్వాధీనం చేసుకున్న శ్రీలంక నేవీ సిబ్బంది.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం. 16 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.02 కోట్లు. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 44,366 మంది భక్తులు.
  • సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ బదిలీ. అమోయ్‌ కుమార్‌ను రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు. నేరేడుచర్ల ఇంచార్జి కమిషనర్‌ మహేందర్‌రెడ్డి సస్పెన్షన్‌. తహశీల్దార్‌ రాంరెడ్డికి ఇంచార్జి బాధ్యతలు. కేవీపీ ఓటు విషయంలో అధికారుల తీరుపై ప్రభుత్వం చర్యలు.

అమెజాన్ స్ఫీడుకు భారత్ బ్రేకులు

, అమెజాన్ స్ఫీడుకు భారత్ బ్రేకులు
ముంబయి: సరికొత్త ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ రూల్స్ తో అమెజాన్‌ సతమతమవుతోంది. దీని నుంచి కోలుకోకుండా కొత్త సంస్థలను కొనుగోళ్లు చేయకూడదని భావించినట్లు తెలుస్తోంది. దీంతో కిషోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ గ్రూప్‌ కోనుగోలును కూడా తాత్కాలికంగా పక్కనపెట్టినట్లు సమాచారం. ఈ డీల్‌ విలువ దాదాపు 700 మిలియన్‌‌ డాలర్లు. కొత్తగా అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు వాటాలు ఉన్న సంస్థల్లో వస్తువులను అమ్మడం కుదరదు. దీంతో అమెజాన్‌ రాత్రికిరాత్రే తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రిటైల్‌ రంగ సంస్థల్లో వాటాలు కొనుగోలు చేసి మార్కెటింగ్‌ చేయడం అమెజాన్‌కు ఇక కుదరకపోవచ్చు. భారత్‌లో పరిస్థితి అమెజాన్‌ యాజమాన్యాన్ని కొంచెం ఇబ్బంది పెడుతోంది.
, అమెజాన్ స్ఫీడుకు భారత్ బ్రేకులు
తగ్గిన స్ఫీడు–
గత ఏడాది ఆఫ్‌లైన్‌ రిటైల్‌ వ్యాపారాల కొనుగోలులో అమెజాన్‌ దూకుడుగా వ్యవహరించింది. చాలా సంస్థలతో కొనుగోళ్లకు సంబంధించి చర్చలు జరిపింది. వీటిల్లో ఆర్‌పీ-ఎస్‌జీ గ్రూప్‌, స్పెన్సర్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌లు ఉన్నాయి. దాదాపు 2 బిలియన్‌ డాలర్లను వెచ్చించి దేశంలో ఆఫ్‌లైన్‌ మార్కెట్‌పై పట్టు సాధించేందుకు అమెజాన్‌ తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలో సెప్టెంబర్‌లో ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన మోర్‌ రిటైల్‌లో దాదాపు 49శాతం వాటాలను కొనుగోలు చేసింది. అదే ఊపులో ఫ్యూచర్‌ గ్రూప్‌తో కూడా డీల్‌ పూర్తి చేద్దామని అనుకొంది. దీనిలో భాగంగానే దాదాపు 15 శాతం వాటా కోసం ఫ్యూచర్‌ గ్రూప్‌లో 700 మిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరిస్తూ ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఫ్యూచర్‌ గ్రూప్‌ కూడా ఈ మొత్తం షేర్లను నగదుకు విక్రయించకుండా అమెజాన్‌ ఇండియాలో వాటా పొందవచ్చని భావించింది.
అప్పట్లో అమెజాన్‌ ఇండియా విలువ దాదాపు 16 బిలియన్‌ డాలర్లు. ఈ డీల్‌ 2019 తొలి త్రైమాసికంలో పూర్తవుతుందని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం హఠాత్తుగా కొత్త నిబంధనలను తెరపైకి తీసుకొచ్చింది. ఫిబ్రవరి 1 నుంచే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా ఈ డీల్‌కు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. దీంతోపాటు షాపర్స్‌ స్టాప్‌లో వాటాను 5 శాతం నుంచి మరింత పెంచుకోవాలన్న ప్రతిపాదనలను కూడా అమెజాన్‌ ప్రస్తుతానికి పక్కన పెట్టింది. కొత్త నిబంధనల ప్రభావం తమ వ్యాపార భాగస్వాములు, వినియోగదార్లపై ఏ మేరకు ఉందో అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలని అమెజాన్‌ భావిస్తోంది.