అగ్ని 5 క్షిపణి పరీక్ష విజయవంతం

, అగ్ని 5 క్షిపణి పరీక్ష విజయవంతం

అగ్ని 5 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని బాలాసోర్‌లో అబ్దుల్‌ కలాం ద్వీపం నుంచి డీఆర్డీవో ఈ క్షిపణిని ప్రయోగించింది. 5 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించే ఈ క్షిపణిని డీఆర్డీవో రూపొందించింది. 1.5 టన్నుల అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే సామర్థ్యం దీనికి ఉంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. ఈ క్షిపణిని ప్రయోగించడం ఇది ఐదోసారి. కాగా ప్రపంచలో అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌ వద్ద మాత్రమే అధికారికంగా ఈ సాంకేతికత ఉంది.