Breaking News
  • తూ.గో: పెద్దాపురంలో దారుణం. యర్రా శివశంకర్‌ అనే వ్యక్తిపై నగేష్‌ కత్తితో దాడి. పరిస్థితి విషమం, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు.
  • అమరావతి: ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. ప్రలోభాలకు లొంగలేదనే మండలి రద్దు తీర్మానం చేశారు. సెలెక్ట్‌ కమిటీ అంటే జగన్‌కు ఎందుకంత భయం. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఎందుకు విచారణ జరపలేదు -ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు.
  • మద్దాల గిరిని ఆర్థికంగా బెదిరించి పార్టీలోకి లాక్కున్నారు.
  • 11 మంది భారతీయ మత్స్యకారులను బంధించిన శ్రీలంక. ఒక పడవను స్వాధీనం చేసుకున్న శ్రీలంక నేవీ సిబ్బంది.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం. 16 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.02 కోట్లు. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 44,366 మంది భక్తులు.
  • సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ బదిలీ. అమోయ్‌ కుమార్‌ను రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు. నేరేడుచర్ల ఇంచార్జి కమిషనర్‌ మహేందర్‌రెడ్డి సస్పెన్షన్‌. తహశీల్దార్‌ రాంరెడ్డికి ఇంచార్జి బాధ్యతలు. కేవీపీ ఓటు విషయంలో అధికారుల తీరుపై ప్రభుత్వం చర్యలు.

అక్రమ ‘బట్టీ’ వ్యాపార౦

, అక్రమ ‘బట్టీ’ వ్యాపార౦

నర్సాపూర్ మండలంలో నిబంధనలకు పాతర వేస్తూ ఇటుకబట్టీల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు అక్రమార్కులు. సంబంధిత శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వీరి వ్యాపారం దర్జాగా కొనసాగుతోంది. మండలంలోని కొత్తపేట గ్రామంలో సుమారు 35 ఇటుక బట్టీలు ఏర్పాటు చేసి పనులు చేస్తున్నా పట్టించుకున్న అధికారులే లేరు.

బట్టీల్లో వాడేందుకు కలపతోపాటు తయారీకోసం మట్టిని స్థానిక చెరువులు, కుంటలు, పొలాల్లో నుంచి తరలిస్తున్నారు. సంబంధిత ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ, విద్యుత్, శాఖల సిబ్బంది కనుసైగల్లోనే వీరి వ్యాపారం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్‌ అక్రమ దారి పడుతోంది. బట్టీల సమీప ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ బోర్లను యథేచ్ఛగా ఇటుక బట్టీల కోసం వినియోగించుకుంటున్నారు. ఆయా బోర్లకు వచ్చే ఉచిత విద్యుత్‌ ద్వారానే వీటికి నీటి సరఫరా జరుగుతోంది. అయినా సంబంధిత విద్యుత్‌శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

ఇటుకబట్టీల వ్యాపారులు ఒడిశా, చత్తీస్‌గఢ్, బీహార్‌ ప్రాంతాలకు చెందిన కూలీలతో బట్టీల్లో పనిచేయించుకుంటున్నారు. రోడ్డుకు ఆనుకొని అక్రమ వ్యాపారం జరుగుతున్నా సంబంధిత శాఖల సిబ్బంది ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పటికైనా  ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బట్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.