7 ఇండియన్ ఐటీ కంపెనీలకు ట్రంప్ సర్కార్ షాక్ !

భారతీయ ఐటీ సంస్థలపై అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం ‘ పగ బట్టినట్టు ‘ కనిపిస్తోంది. ఇండియాలోని పెద్ద ఐటీ కంపెనీలకు షాకిచ్ఛే నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఏడు సంస్థలు హెచ్ 1 బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకోకుండా వాటిని నిషేధించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మూడో త్రైమాసికంలో హెచ్ 1 బీ వీసాల తిరస్కరణ రేటు 24 శాతానికి చేరుకుందని ‘ నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ‘ అధ్యయనంలో తేలింది. ఈ వీసాలకోసం […]

7 ఇండియన్ ఐటీ కంపెనీలకు ట్రంప్ సర్కార్ షాక్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 12, 2019 | 3:12 PM

భారతీయ ఐటీ సంస్థలపై అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం ‘ పగ బట్టినట్టు ‘ కనిపిస్తోంది. ఇండియాలోని పెద్ద ఐటీ కంపెనీలకు షాకిచ్ఛే నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఏడు సంస్థలు హెచ్ 1 బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకోకుండా వాటిని నిషేధించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మూడో త్రైమాసికంలో హెచ్ 1 బీ వీసాల తిరస్కరణ రేటు 24 శాతానికి చేరుకుందని ‘ నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ‘ అధ్యయనంలో తేలింది. ఈ వీసాలకోసం దరఖాస్తు చేసుకోవడానికి మీకు అర్హత లేదంటూ బ్యాన్ చేసిన సంస్థల్లో.. అజిమెట్రి, బుల్ మెన్ కన్సల్టెంట్ గ్రూప్, బిజినెస్ రిపోర్టింగ్ మేనేజ్ మెంట్ సర్వీసెస్, నెటేజ్, కెవిన్ చాంబర్స్, ఈ-ఎస్ పైర్ ఐటీ ఎల్ఎల్ సీ వంటివి ఉన్నాయి. ఈ వీసా అప్లికేషన్లపై ట్రంప్ ప్రభుత్వం కఠిన పాలసీని పాటిస్తోందని యుఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నుంచి అందిన డేటాను బట్టి తెలుస్తోంది. ప్రధాన ఇండియన్ ఐటీ సంస్థలపై ఈ ‘ రిజెక్షన్ కొరడా ‘ చాలా ఎక్కువగా ఉందని అంటున్నారు. ట్రంప్ సర్కార్ నిర్ణయంతో భారత్ లోని ఐటీ సంస్థలు చిక్కుల్లో పడ్డాయి. యుఎస్ వీసా తిరస్కరణలు మొత్తంగా 40 శాతానికి చేరుకోగా.. నానాటికీ పరిస్థితి అధ్వాన్నంగా మారవచ్చునని తెలుస్తోంది. వీసా తిరస్కరణల ఉచ్ఛు నుంచి సులభంగా బయటపడాలంటే అమెరికాలోనే ఆ దేశ నిపుణులను తమ సంస్థల్లో నియమించుకోవాల్సి ఉంటుంది. ‘ బై అమెరికన్.. అండ్ హైర్ అమెరికన్ ‘ పాలసీని ట్రంప్ ఖఛ్చితంగా పాటిస్తున్న సంగతి విదితమే. యుఎస్ జీడీపీకి భారతీయ ఐటీ సంస్థలు 58 బిలియన్ డాలర్ల మేర కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. యుఎస్ హెచ్ 1 బీ వీసాల తిరస్కరణ పెరిగిన నేపథ్యంలో మన ఐటీ కంపెనీలు ఆ దేశంలోనే తమ విభాగాలను ప్రారంభించాలని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్ దాస్ పాయ్ అభిప్రాయపడుతున్నారు.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన